RGV: నిత్యం ఏదో వార్తతో పబ్లిసిటీ తెచ్చుకోవడం రామ్ గోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన పొగిడినా, విమర్శించిన సంచలనం, వివాదాస్పదమే. తన అభిప్రాయాలను ఎవరికి భయపడకుండా నిర్భయంగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. ఆర్జీవీ కళ్లలో పడ్డారంటే చాలు.. వాళ్ల ఫేట్ మారుతుంది.
ప్రస్తుతం వివాదాస్పద అంశాలతోె సినిమాలు తీస్తూ… ట్రెండింగ్ లో ఉంటారు ఆర్జీవీ. తాజాగా తెలంగాణ నాయకుడు కొండా మురళి జీవితం ఆధారంగా మరో సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మరోవైపు ట్విట్టర్ లో వ్యాఖ్యలతో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు వర్మ. ఇటీవల అల్లు అర్జున్ మాత్రమే మెగా కుటుంబంలో స్టార్ల అంటూ.. పలు కామెంట్లు చేశారు. మరోవైపు పవన్ కళ్యాన్ ని కూడా కెలికాడు. ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని, ఆర్జీవి మధ్య ట్విట్ వార్ జరిగిన సంగతి తెలిసింది.
ఇదిలా ఉంటే అందాన్ని ఆరాధించడంలో వర్మ రూటే సపరేటు. బిగ్ బాస్ బ్యూటీలు అషు రెడ్డి, అరియానాలు ఏకంగా వర్మతో బోల్డ్ ఇంటర్యూలు చేసి ఫేమస్ అయ్యారు. ఇప్పుడు వర్మ కళ్లు యాంకర్ శ్యామలపై పడింది.
బడవ రాస్కెల్ ఈవెంట్ హోస్ట్ చేస్తున్న శ్యామల… ఆర్జీవిని నేరుగా కలవడం ఇదే ఫస్ట్ అని అన్నారు. తర్వాత వర్మ మాట్లాడుతూ.. మీరు ఇందాక ఓ మాట అన్నారు… నన్ను కలవడం ఫస్ట్ టైం అని.. ఇది పక్కన ఉంచితే.. ఇంత అందంగా ఉన్న మీరు ఇంతకాలం నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారంటూ.. వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ తో ఒక్క సారిగా యాంకర్ శ్యామల షాక్ తిన్నారు. ఓ నవ్వు నవ్వారు. అలాగే నన్ను తోపు, రౌడీ అన్నారు.. నేను రాస్కెల్ కూడా’ అంటూ షాకిచ్చాడు వర్మ.