Chandrababu Sideline Nara Lokesh : నారా లోకేష్‌ని చంద్రబాబు పక్కన పెట్టేయగలరా.?

Chandrababu Sideline Nara Lokesh :  తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద మైనస్ పాయింట్ నారా లోకేష్.. అన్న ప్రచారం ఈనాటిది కాదు. స్వర్గీయ నందమూరి తారకరామారావు అభిమానులు, యంగ్ టైగర్ ఎన్టీయార్ లేదా బాలకృష్ణల్లో ఎవరో ఒకరికి టీడీపీ పగ్గాలు దక్కాలని చాలాకాలంగా కోరుకుంటున్నారు.

మళ్ళీ ఇక్కడ ఎన్టీయార్‌కే ఎక్కువ ఓట్లు పడతాయి. వాస్తవ పరిస్థితి ఏంటి.? తన పట్ల ఎవరేమనుకుంటున్నారు.? అన్నదానిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి ఖచ్చితమైన అవగాహన వుంది.

నో డౌట్, నారా లోకేష్‌ని గనుక చంద్రబాబు పార్టీ కార్యక్రమాల నుంచి కాస్త దూరంగా వుంచితే, టీడీపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం వుందన్నది మెజార్టీ అభిప్రాయం. టీడీపీలో చాలామంది సీనియర్లు ఇదే భావనను వ్యక్తం చేస్తున్నారు.

కానీ, తన రాజకీయ వారసత్వాన్ని తన పుత్రరత్నం కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. లోకేష్ అసమర్థత ఎన్నిసార్లు బయటపడుతున్నా చంద్రబాబు ముందు మరో ఆప్షన్ లేదు.
నారా లోకేష్ ఎటూ తన మేనల్లుడు, పైగా తనకు అల్లుడు కావడంతో నందమూరి బాలకృష్ణ కూడా సైలెంటయిపోయారు.. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు పెట్టిన పార్టీ అత్యంత పతనావస్థలో వున్నాగానీ.

లేకపోతే, బాలయ్య కాస్తో కూస్తో టీడీపీలో చక్రం తిప్పడానికి ప్రయత్నించేవారే.. టీడీపీని బాగుచేయడానికి కష్టపడేవారే.

రాజకీయ పరమైన కార్యక్రమాల్లోగానీ, అసెంబ్లీలోగానీ.. నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేగా పార్టీని వెనకేసుకొచ్చింది, పార్టీ కోసం పని చేసిందీ చాలా తక్కువ. సో, ఎలా చూసినా యంగ్ టైగర్ ఎన్టీయార్ మాత్రమే టీడీపీని కాపాడగలడు.

కానీ, నారా లోకేష్ అందుకు అంగీకరించడు. లోకేష్‌ని పక్కన పెడితే పార్టీ బాగవుతుందని తెలిసినా చంద్రబాబు, ఎన్టీయార్‌ని పార్టీలోకి ఆహ్వానించరు, టీడీపీ బాగుపడదు.! ఇదింతే, ఈ కథ ఇంతే.!