Ramcharan: రామ్ చరణ్ శంకర్ సినిమాలో నటించనున్న స్టార్ డైరెక్టర్… ఎవరంటే?

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదల కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా విడుదల కానుంది. ఇక ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నారు.

ఇప్పటికే పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకోగా తాజాగా ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాలని శంకర్ చెప్పగానే కథవిన్న దర్శకుడు ఎస్.జే సూర్య మరో మాట మాట్లాడకుండా ఈ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఎస్.జె.సూర్య ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్ చిత్రంలో నటించారు. అదేవిధంగా విజయ్ నటించిన అదిరింది సినిమాతో పాటు శింబు నటించిన మానాడు చిత్రంలో కూడా ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటించారు. ఎస్.జె.సూర్య ఒక ప్రముఖ దర్శకుడిగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించగా ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించనున్నారు.