Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ తన సక్సెస్ కు తానే కారణం అంటూ తనకి ఎవరు గురువు లేరంటూ గతంలో చెబుతూ వచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అయినప్పటికీ అల్లు అర్జున్ కూడా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోగా మాత్రమే మెగా అభిమానులు భావిస్తున్నారు కానీ బన్నీ మాత్రం తన సక్సెస్ కు తానే కారణమంటూ ఇటీవల సదస్సులో చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ప్రతి ఏడాది ఒక్కో సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న అల్లు అర్జున్ డీజే సినిమా తర్వాత నా పేరు సూర్య సినిమాతో డిజాస్టర్ సినిమాని ఎదుర్కొన్నారు.
ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఏడాది పాటు సినిమాలు చేయలేదు ఆ సమయంలో నేను ఎవరి మాట వినలేదు.తన మాటే విన్నాడట. తనతో తానే మాట్లాడుకోవడం నేర్చుకున్నాడట. నిర్ణయాలను స్వయంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నాడట. అంతరాత్మను మించిన గురువు ఎవరూ లేరు అనేదాన్ని తెలుసుకున్నాడట. ఇలా తనను తానే తీర్చిదిద్దుకోవటం వల్లే నాకు అలా వైకుంఠపురంలో పుష్ప వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయని బన్నీ తన సక్సెస్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు.
ఇలా తన సక్సెస్ కు తన నిర్ణయాలే కారణమని తన ఆలోచనలే సక్సెస్ బాటలో నడిపించాయని బన్నీ చెప్పడం బానే ఉంది కానీ ఇక్కడే తనకు గురువు ఎవరూ లేరని నేను ఎవరి మాట వినలేదని చెప్పడంతో మళ్ళీ మెగా ఫ్యాన్స్ లైన్లోకి వచ్చి బన్నీ పై విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు. ఇక్కడ పక్క వారి మాటలు వినడం మానేశాని, తనకు ఎవరు గురువులు లేరు అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్ కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించే చెప్పారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు నువ్వు ఐకాన్ స్టార్ అయిన నీకు జీవితం ఇచ్చింది మాత్రం చిరంజీవిని అని మూలాలను మాత్రం మర్చిపోవద్దు అంటూ మెగా అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.