చిరంజీవిని క‌లిసిన మంచు హీరో.. ఎందుకు క‌లిసాడ‌నేది త్వ‌ర‌లో చెప్తాడ‌ట‌!

చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని త‌న సినిమాల‌తో కొన్ని ద‌శాబ్ధాలుగా అల‌రిస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడున్న యువ హీరోలు ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి ఆద‌ర్శం కూడా చిరంజీవి. ఎంతో మందిలో స్పూర్తి నింపిన చిరంజీవి యువ‌త‌కు త‌న స‌పోర్ట్ అందిస్తున్నారు. రీసెంట్‌గా బిగ్ బాస్ స్టేజ్‌పై నుండి మెహ‌బూబ్‌కు రూ.10 ల‌క్ష‌లు రూపాయ‌లు అందించ‌డం, సోహైల్ సినిమాలో క్యామియో రోల్ పోషిస్తాన‌న‌డం చిరు గొప్ప‌త‌నానికి అద్ధం ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి లాక్‌డౌన్ స‌మ‌యంలో కార్మికులకి అండ‌గా నిలిచారు

సినీ ప‌రిశ్ర‌మ ఇబ్బందుల‌లో ఉంటే వెంట‌నే దానిపై స్పందిస్తూ త‌గు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు చిరంజీవి. ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి ఏ ఇబ్బంది వ‌చ్చినా కూడా చిరంజీవి ముందు ఉండి ఆ స‌మ‌స్య‌ల‌ను సాల్వ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మంచు హీరో విష్ణు చిరంజీవిని క‌లిసారు. ఆయ‌న‌తో కొద్ది సేపు చ‌ర్చించాట‌ర‌. అయితే ఎందుకు క‌లిసాడ‌నే విష‌యం ఇప్పుడు మాత్రం చెప్ప‌డ‌ట‌. త‌న సోష‌ల్ మీడియాలో చిరంజీవితో క‌లిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. బిగ్ బాస్ చిరంజీవి అంకుల్‌ని క‌లిసాను. ఎందుకు క‌లిసాను అనేది త్వ‌ర‌లో చెప్తాను. ఆయ‌న‌కు ఎన్నో ప్ర‌శ్న‌లు వేసి స‌మాధానం రాబ‌ట్టుకునే అవ‌కాశం నాకు ద‌క్కింది.
ఆయ‌న స‌మాధానాలు నాకు ఎన్నో నేర్పాయి. ఆయ‌న మెగాస్టార్ ఎందుక‌య్యారో అంద‌రికి తెలిసిందే. అందులో ఆశ్చ‌ర్య పోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు అని విష్ణు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మంచి అవినావ సంబంధం ఉంది. ఇప్ప‌టికీ చిరంజీవి, మోహ‌న్ బాబు చాలా అన్యోన్యంగా ఉంటారు. మ‌ధ్య‌లో గొడ‌వ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని చెరిపేసి ఇప్ప‌టికీ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. గతంలో చిరు, మోహ‌న్ బాబు క‌లిసి చేసిన సినిమాలు చాలా హిట్స్ అయ్యాయి. ఈ జ‌న‌రేష‌న్ హీరోలు చిరంజీవి, మోహ‌న్ బాబు క‌లిసి చేసిన సినిమాల‌ని రీమేక్ చేయాల‌ని అనుకుంటున్నారు. మ‌రి అది ఎప్పుడు జ‌రుగుతుందో చూడాలి.