Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం మనం ఎన్నో రకాల వస్తువులను ఇంటిలో అమర్చుకుంటాము. ఇలా ఇంటికి సంబంధించిన ఏ విషయం గురించి అయినా వాస్తు శాస్త్రాన్ని అనుసరించి అన్ని సవ్యంగా ఉండేలా చూసుకుంటారు. అయితే చాలామంది ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఇంటిలో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు.ఇలా చాలా మంది ఆర్థిక సమస్యల నుంచి బయట పడటం కోసం ఇంటిలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ ఎంతో శుభప్రదమైనదిగా భావించి ఇంట్లో పెట్టుకుంటారు.కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేసే చోట ఆఫీసులలో కూడా ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని భావిస్తారు.అయితే ఇంట్లో ఏ విధమైనటువంటి లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టుకోవడం మంచిది ఎలాంటి దిశలో పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోకూడదు అనే విషయానికి వస్తే…
ఇంట్లో లాఫింగ్ బుద్ధ డబ్బు సంచిని మోస్తూ ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకోవడం ఎంతో మంచిది.ఈ విగ్రహాన్ని కూడా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇకపోతే ఈ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎత్తు ప్రదేశం లో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇది ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవటం మంచిది. ఇకపోతే ఈ విగ్రహాన్ని ఎప్పుడూ కూడా వంటగది, పడకగది, డైనింగ్ టేబుల్, బాత్ రూమ్స్ దగ్గర పొరపాటున కూడా పెట్టకూడదు. ఇలా లాఫింగ్ బుద్ధ విగ్రహంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.