RGV: నాకు కేవలం నాచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసు అంటూ కొడాలికి కౌంటర్ ఇచ్చిన.. వర్మ!

RGV: ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సినిమా టికెట్ల వ్యవహారం పై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.దీంతో వర్మ మాటలకు దీటుగా ఏపీ మంత్రులు వరుసగా మీడియా సమావేశమై సినీ ఇండస్ట్రీ పై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ టికెట్ల విషయంపై స్పందిస్తూ ప్రభుత్వం తీరును దూషించారు ఇలా వర్మకి పేర్ని నాని మధ్య ట్వీట్ల వివాదం చెలరేగుతోంది

ఇలా వీరిద్దరి మధ్య ఈ వివాదం జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో కొడాలి నాని ఎంట్రీ అయ్యారు.ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ అసలు రాంగోపాల్ వర్మ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని తెలిపారు. వర్మ పక్క రాష్ట్రంలో ఉండి ఏపీ గురించి ఏమైనా మాట్లాడుతారని కానీ మేము మాత్రం పక్క రాష్ట్రం పక్క దేశాల్లో ఉండే వారి గురించి పట్టించుకోమని తెలిపారు.

మామూలుగానే రామ్ గోపాల్ వర్మ తనకు సంబంధం లేని వ్యవహారంలో వేలుపెట్టి గెలకడం తన నైజం. అలాంటిది ఎవరైనా తనని గెలికితే తాను స్పందించకుండా ఉంటారా..ఈ క్రమంలోనే కొడాలి నాని రామ్ గోపాల్ వర్మ పై స్పందించడంతో రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై స్పందించి ఎవరో సినిమా టికెట్ల విషయంపై కొడాలి నాని స్పందిస్తున్నారట నాకు తెలిసి ఇప్పటివరకు నాచురల్ స్టార్ నాని తప్ప నాకు ఎలాంటి నాని తెలియదని రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కొడాలి నాని పై సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.