తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైకాపా లోకి జంపింగ్ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి ముగ్గురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్న సంగతి తెలిసిందే. అధికారికంగా వైకాపాలో చేరకపోయినా వెనుకుండి సపోర్ట్ చేస్తున్నారు. వారే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపాకు మద్ధతిస్తున్నారు. ఇక శాసనమండలి నుంచి పోతుల సునీత, శివనాథ్ రెడ్డి కూడా వైకాపాకే జై కొట్టారు. మరో ఎమ్మెల్సీ డొక్కా కూడా రాజీనామా చేసి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా టీడీపీ నుంచి ఎన్నికైనా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు కూడా సైకిల్ దిగి ప్యాన్ కిందకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
వీరిద్దరి ఎంట్రీ కూడా లాంఛనమే అని పచ్చ మీడియా సైతం జోరుగా ప్రచారం చేసింది. అయితే వీళ్లిద్దరు ఊహించని షాక్ ఇచ్చినట్లు అదే పచ్చ మీడియా ప్రచారం మొదలు పెట్టింది. ఇరువురు కూడా తెలుగు దేశం పార్టీని వీడేది లేదని స్పష్టం చేసారుట. అందుకు ఆధారం లేదు. ఇలాంటి కథనాలు ఎందుకొస్తున్నాయో అర్ధం కాలేదన్నారు. కావాలనే ఓ సెక్షన్ మీడియా తమని ఇరకాటంలో పడేస్తుందని ప్రచారం లేవనెత్తింది. వీరిద్దరితో పార్టీ అధినేత చంద్రబాబు నాయడు, అండ్ సన్ లోకేష్ తో మాట్లాడారుట.
అప్పటి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు లోకేష్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారుట. వాళ్లకి కావాల్సిన వన్నీ లోకేష్ ఏర్పాటు చేస్తున్నాడుట. ఇరువురు ఎమ్మెల్యేలు స్థానిక నియోజకవర్గ నేతల్ని లోకేష్ ఆధ్వర్యంలో పిలిపించి మాట్లాడినట్లు చెబుతున్నా రు. స్థానిక నేతలు పార్టీ బలోపేతానికి కావాల్సిన సహకారం తమకి అందిస్తామని, ఎలాంటి అధైర్యపడొద్దని చెప్పారు ట. ఈ మొత్తంవ్యవహారంలో లోకేష్ కీలక పాత్ర పోషించినట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ మాట ఆ ఇద్దరి ఎమ్మెల్యేలకు శాసనం లాంటిందని అంటున్నారు.