Lokesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన కూటమి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం పై ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యిండుకొని ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని తెలిపారు.రాష్ట్రంలో నక్సలిజం పెరుగుతోందన్న ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఇలా ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టదు అంటూ లోకేష్ వార్నింగ్ ఇచ్చారు అదేవిధంగా ప్రజలు తమకు అవకాశం కల్పించింది మంచి సుపరిపాలన అందించడానికి కానీ కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి కాదని లోకేష్ తెలిపారు.
తమకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉందని ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేరుస్తామని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని కూడా తెలియజేశారు. లిక్కర్ స్కామ్‌లో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాను, తన కుటుంబం దేవుడి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమని లోకేష్ తెలిపారు. జగన్ సన్నిహితుడు భాస్కర్ రెడ్డి కూడా ఇలాంటి ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్‌కు సంబంధం లేదని వారు దేవుడి సాక్షిగా చెప్పగలరా అని లోకేష్ ప్రశ్నించారు. జగన్ పై ఉన్న కేసులు ప్రస్తుతం విచారణ జరుగుతున్నాయని తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అంటూ లోకేష్ మీడియా సమావేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.