AP: తల్లికి వందనం సూపర్ సక్సెస్… జగన్ రెడ్డికి కడుపు మంట పెరిగింది… లోకేష్ కౌంటర్!

AP: ఏపీలో ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అద్భుతమైన మెజారిటీని సాధించి అధికారాన్ని అందుకున్నాయి. ఇలా అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటివరకు సూపర్ సిక్స్ హామీలను సరైన విధంగా అమలు చేయకపోవడంతో కూటమి పార్టీ నేతలపట్ల విమర్శలు వస్తున్నాయి. ఇలా ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్న కూటమినేతలు సూపర్ సిక్స్ హామీలకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క తల్లి ఖాతాలో 13వేల రూపాయల జమ అయ్యాయి ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఒక్కొక్కరికి చొప్పున 13వేల రూపాయలను జమ చేశారు. ఇలా ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీకి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. తల్లికి వందనం పథకం సూపర్ సక్సెస్ కావడంతో తల్లుల కళ్ళల్లో ఆనందం చూసి జగన్ రెడ్డికి మూడింతల కడుపు మంట పెరిగిపోయింది అంటూ లోకేష్ సెటైర్లు వేశారు.

మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. ఆరుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులు, అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని వెల్లడించారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయన్నారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం జగన్ రెడ్డి బ్రాండ్‌ అని దుయ్యబట్టారు. మీ హయామంలో జరిగినట్టే అవినీతి అక్రమాలు ప్రతిసారి జరుగుతాయి అనుకుంటే ఎలా మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం.. చెయ్యనివ్వమని స్పష్టం చేశారు. జగన్ రెడ్డికి కడుపు మంటగా ఉన్నట్టుంది.. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త కడుపు మంట తగ్గుతుంది అంటూ తనదైన శైలిలోనే జగన్ రెడ్డికి కౌంటర్లు ఇచ్చారు.