AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయని చెప్పాలి. నిత్యం ఏదో ఒక అంశం ద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయాలు జాతీయస్థాయిలో వినపడుతూ ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో కూటమి వర్సెస్ వైసీపీ అనే విధంగా నిత్యం ఏదో వార్తల్లో నిలుస్తున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘరంగా ఓటమిపాలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. యువ గళం పేరుతో మొదలైన ఈ పాదయాత్రలో భాగంగా గత ప్రభుత్వం తమ పార్టీ నేతల పట్ల కార్యకర్తల పట్ల ఎన్నో హింసలకు పాల్పడ్డారని ఇబ్బంది పెట్టిన వారందరి పేర్లు కూడా ఈ బుక్కులో రాస్తున్నానని తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సరైన రీతిలో బుద్ధి చెబుతామంటూ లోకేష్ గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఇలా చెప్పిన విధంగానే 2024 ఎన్నికలలో అధికారంలోకి రావడంతో లోకేష్ తన రెడ్ బుక్ ఓపెన్ చేస్తూ.. ఒక్కొక్కరిపై కేసులు పెడితే అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం కాదని లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ కామెంట్లు వినిపించాయి.
ఇక ఈ రెడ్ బుక్ గురించి కేవలం రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయస్థాయి మీడియాలో కూడా సంచలనంగా మారింది అయితే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా కొంతమంది కార్యకర్తలు రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగులతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో ఈ డైలాగ్ చెప్పడంతో ఇది కూడా జాతీయస్థాయి మీడియాలో మారుమోగుతుంది. ఇలా రెడ్ బుక్ వర్సెస్ రప్పా రప్పా అంటూ ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఏకంగా జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారాయి.