Ambanti Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబంటి రాంబాబు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారని చెప్పాలి. చంద్రబాబు నాయుడు పట్ల తరచూ ప్రశ్నలు సంధిస్తూ పెడుతున్నారు. అయితే తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు నారా లోకేష్ చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒక బిడ్డే చాలని అనుకుంటున్నారు అందుకు కారణాలు కూడా లేకపోలేదు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక బిడ్డని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుత కాలంలో ఒక బిడ్డను పెంచి పోషించడం వారికి సరైన విద్య ఉద్యోగ అవకాశాలను కల్పించడం అంటే ఎంతో కష్టతరమైన అంశం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఒక్కరే చాలని భావిస్తున్నారు. ఇకపోతే దేశ జనాభా తక్కువ అవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పిల్లల్ని కనాలి అంటూ ప్రోత్సహిస్తున్నారు. ఇదే విషయం గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అంబంటి రాంబాబు మాట్లాడుతూ.. మార్పు అనేది మన నుంచి మొదలు కావాలని తెలిపారు. ఈ విషయం గురించి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. “నువ్వు మీ నాన్నకు ఒక్కడివే కొడుకు.. నీకు ఒక్కడే” దేశంలో ఉన్న జనాభాను మాత్రం పిల్లల్ని కనాలని చెబుతున్న మీరు ఎందుకు ఒక్కరినే కన్నారని ప్రశ్నించారు. ఇలా అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కూడా నిజం కావడంతో ఎంతోమంది అంబటి రాంబాబుకు మద్దతు తెలియజేస్తున్నారు. అంబంటి మాట్లాడిన మాటలలో కూడా నిజమే ఉంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈయన వేసిన ప్రశ్నలకు లోకేష్ చంద్రబాబు ఏ విధమైనటువంటి సమాధానం చెబుతారో తెలియాల్సి ఉంది.
