Trivikram Srinivas: ఒకే స్టార్ హీరోయిన్ తో ఏకంగా మూడు సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్…!

Trivikram Srinivas: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే వారికి ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. చాలామంది వారి సినిమాలు విజయవంతం కావడానికి ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఇలా సెంటిమెంట్లను ఫాలో అయ్యే వారిలో మాటలు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాల విషయంలో కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు.

ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా తాను దర్శకత్వం వహించే సినిమాలకు ఎక్కువగా ‘అ’ అనే పదంతో సినిమా టైటిల్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.ఇలా సినిమా టైటిల్ విషయంలోనే కాకుండా హీరోయిన్ల విషయంలో కూడా ఈయన ఒక సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.అయితే అదేమిటి అనే విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓకే హీరోయిన్ తో వరసగా మూడు సినిమాలు చేస్తారనే విషయం ఇండస్ట్రీలో వినబడుతుంది. అయితే ఇదివరకే స్టార్ హీరోయిన్ సమంతతో త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తారింటికి దారేది చిత్రాన్ని తీశారు.

ఈ సినిమా విజయవంతం అయిన తర్వాత సమంతతో అల్లు అర్జున్ సరసన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశారు. అలాగే నితిన్ హీరోగా అఆ సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా తీసుకున్నారు. ఇలా వరుసగా మూడు చిత్రాలలో సమంతనే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఇదిలా ఉండగా అరవింద సమేత చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలా వైకుంఠపురం సినిమాలో కూడా నటించారు.ఇక మహేష్ బాబు తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.దీన్ని బట్టి చూస్తుంటే ఒక హీరోయిన్ తో ఈయనకు ఇలా మూడు సినిమాలు చేయడం సెంటిమెంట్ గా వస్తోందని పలువురు భావిస్తున్నారు. మరి ఈ సారి త్రివిక్రమ్ ఏ హీరోయిన్ ఎంపిక చేసుకుంటారో తెలియాల్సి ఉంది.