Vijay devarakonda: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్ పంపించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోలలో ఇద్దరి హీరోల మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తరచూ విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ కు సంబంధించిన వస్తువులను అల్లు అర్జున్ కు స్పెషల్ గా పంపిస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు.
గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా పుష్ప 2 అని రాసి ఉన్న టీషర్ట్ స్పెషల్ గా డిజైన్ చేయించి అల్లు అర్జున్ కోసం కానుకగా పంపించారు అయితే తాజాగా మరోసారి కూడా అల్లు అర్జున్ సర్ప్రైజ్ చేస్తూ విజయ్ దేవరకొండ కొన్ని గిఫ్ట్ లు పంపించారు.
ఇటీవల విజయ్ దేవరకొండ హైదరాబాదులో మరో రౌడీ బ్రాండ్ స్టోర్ ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన బ్రాండ్ కి సంబంధించిన దుస్తులను పిల్లల కోసం అలాగే అల్లు అర్జున్ కోసం పంపించారు వీటితో పాటు బర్గర్లను కూడా పిల్లల కోసం స్పెషల్ గా విజయ్ దేవరకొండ పంపించారు. ఇలా విజయ్ దేవరకొండ పంపించిన ఈ గిఫ్ట్ లను అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.
ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన ఈయన మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్”అని తన స్టోరీలో బన్నీ రాశారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతం తిన్న నూరి దర్శకత్వంలో రాబోతున్న కింగ్ డమ్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.