Manchu Vishnu: తన కొడుకు పుట్టినరోజును ఈ ప్రపంచమే జరుపుకుంటుంది.. మంచు విష్ణు!

Manchu Vishnu: టాలీవుడ్ హీరో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తన కొడుకు
ఆవ్రమ్‌ గురించి మనకు తెలిసిందే. అయితే తన కొడుకు
ఆవ్రమ్‌ జనవరి 1వ తేదీ 4 వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మంచు విష్ణు తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ ప్రపంచం మొత్తం తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది.. నా జీవితమంతా తనతోనే సెలబ్రేషన్స్ చేసుకుంటా అంటూ తన కొడుకు పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన కొడుకుని ఎత్తుకుని ఉన్న ఫోటోని షేర్ చేశారు.

ఇక మంచు విష్ణు,విరోనికా దంపతులకు నలుగురు సంతానం కాగా వీరిలో ముగ్గురు కూతుర్లు నాలుగవ సంతానమే అబ్బాయి. నిత్యం విష్ణు పిల్లలకు సంబంధించిన ఫోటోలను తన భార్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు . ఇలా వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.ఇక పోతే ఈ సారి జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే.

ఒకవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాధ్యతలను నిర్వహిస్తూ మరోవైపు పలు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన ఢీ సినిమా సీక్వెల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.