Avasaraala Sreenivas: నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే… అవసరాల శ్రీనివాస్!

Avasaraala Sreenivas: మామూలుగా ఏ తల్లిదండ్రులైనా పిల్లల బాగోగులతో పాటు, భవిష్యత్ కూడా బాగుండాలని కోరుకుంటారు. అలాగే తన విషయంలో కూడా అదే జరిగిందని శ్రీనివాస్ అవసరాల తెలిపారు. తన పెళ్లి విషయంలో వాళ్లను కన్విన్స్ చేశాననే అనుకుంటున్నానని ఆయన అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ విషయంలో తన తండ్రి కొంచెం జెలసీగా కూడా ఫీలవుతున్నట్టు ఆయన నవ్వుతూ చెప్పారు. ఎందుకంటే ఆయనకు ఈ నిర్ణయం బాగా నచ్చిందని శ్రీనివాస్ అన్నారు.

దీని గురించి ఈ మధ్య వారిద్దరూ రోజుకు రెండు, మూడు గంటలు మాట్లాడుకుంటున్నామని ఆయన అన్నారు. సీక్రెట్‌గా ఆయనక్కూడా ఈ నిర్ణయం బాగుందని ఫీలవుతున్నట్టు తనకు అనిపిస్తుందని ఆయన చెప్పారు. మామూలుగా అయితే ఒక వయసు వచ్చాక తీసుకునే నిర్ణయం ఇది అని చాలా మంది అంటుంటారు. కానీ ఒక ఏజ్ వచ్చాక ఓపిక లేక తీసుకునే డిసిషన్‌ ఇది అని ఆయన తన అభిప్రాయం చెప్పారు.

ఇకపోతే తను ఒకప్పుడు రాకెట్ బాల్ ప్లేయర్ అని, అప్పట్లో తనకు అది ఆడడం అంటే చాలా ఇష్టం ఉండేదని శ్రీనివాస్ తెలిపారు. అంతే కాకుండా తాను కిషోర్ కుమార్ పాటలు బాగా వింటానని, తనకు హిందీ వచ్చింది కూడా ఆయన పాటలు వినడం వల్లే అని ఆయన స్పష్టం చేశారు. మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రస్ట్ ఉండేదని, కానీ నేర్చుకోలేదని, ఇప్పటికీ నేర్చుకుంటే బాగుండననిపిస్తుందని ఆయన అన్నారు. ఎవరైనా అడగగానే పాట పాడాలనిపిస్తుందని, కానీ రాదని ఆయన చెప్పారు.