“RC 15” లో సౌత్ దర్శక, నటుడు కీలక పాత్ర..ఇంతకీ ఎవరంటే.!

Producer Dil Raju gave a new update about Ram Charan and Shankar movie

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని తెరకెక్కుతున్న సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇంకా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కెరీర్ లో కూడా 15వ సినిమాగానే తెరకెక్కుతుండగా ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సినిమాని అయితే శంకర్ అదిరే లెవెల్లోనే తెరకెక్కిస్తుండగా పలు ఆసక్తికర అప్డేట్స్ వినిపిస్తున్నాయి. శంకర్ దాదాపు తెలుగు కాస్ట్ తోనే ఈ సినిమాని తీస్తుండగా ఇప్పుడు సౌత్ నుంచి ఓ స్టార్ నటుణ్ని కీలక పాత్ర కోసం రంగంలోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.

మరి ఆ నటుడు ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు టర్న్డ్ నటుడు ఎస్ జే సూర్య అట. ఖుషి, నాని, కొమరం పులి లాంటి పలు సినిమాలు డైరెక్ట్ చేసి ఇప్పుడు నటుడుగా అనేక సినిమాలు చేస్తున్న ఎస్ జె సూర్యకి చరణ్ సినిమాలో ఒక కీలక పాత్ర ఉందట.

అంతే కాకుండా తాను ఈ సినిమాలో ఒక సీఎం కొడుకుగా కనిపిస్తాడని అలాగే కాస్త పాజిటివ్ గానే కనిపించే రోల్ తాను చేస్తున్నాడని సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి అయితే తమిళ్ లో ఈ సినిమాకి శంకర్ తర్వాత మరో గట్టి మైలేజ్ వచ్చే పాయింట్ అయితే యాడ్ అయ్యిందని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.