Samantha: సమంత ఆస్తుల విలువ అన్ని రూ. కోట్లా.. పదేళ్ల ఇండస్ట్రీలో అంత సంపాదించినా పేద పిల్లా!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమంత పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం సినిమా జోరు తగ్గించకుండా వరుస సినిమాలతో దూసుకుపోతూ బిజీగా గడిపారు. ఇక విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత ఈమె సినిమాలపై మరింత దృష్టి పెట్టారు.

ఇలా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు వ్యాపార రంగాలలో అడుగుపెట్టి అద్భుతమైన వ్యాపారవేత్తగా ముందుకు సాగిపోవడమే కాకుండా ఎన్నో రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతుల డబ్బు సంపాదిస్తోంది. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి సమంత సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వ్యాపార రంగంలో సుమారు వంద కోట్లకు పైగా ఆస్తిని సంపాదించినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సమంత ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ కేవలం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇన్ని కోట్లు సంపాదించడం విశేషం.అయితే సమంత సంపాదించిన డబ్బులు కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు అందిస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సమంత సహాయం చేస్తున్నారు.