Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పిరికివాడంటూ…. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లోని టాప్ హీరోలతో పోటీ పడుతున్నాడు. పెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి వంటి సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కెరీర్ ప్రారంభంలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత పెళ్లి చూపులు ద్వారా పూర్తిస్థాయి హీరోగా నటించాడు. విజయ్ దేవరకొండ కెరీర్లో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.

గీత గోవిందం సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత నోటా, టాక్సీవాలా సినిమాలు కూడా విజయ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ ఈ హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర లో అనన్య పాండే నటిస్తోంది.

పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ పై అనన్య పాండే సంచలన కామెంట్స్ చేసింది. లైజర్ సినిమాలో తనతో పాటు నటిస్తున్న సమయంలో విజయ్ దేవరకొండని బాగా అబ్జర్వ్ చేసి ఆయన గురించి హాట్ కామెంట్స్ చేసింది. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే విజయ్ కి, రియల్ లైఫ్ లో విజయ్ కి చాలా వ్యత్యాసం ఉందని, అంతే కాకుండా సహజంగా విజయ్ దేవరకొండ చాలా పిరికి వాడు అని తెలిపింది. అంతే కాకుండా ఒక హీరోయిన్ గా తనకు అవసరమైన సౌకర్యాలను కల్పించిన మంచి వ్యక్తి అని కూడా పొగడ్తలతో ముంచేసింది. లైగర్ సినిమా ఆగష్టు 25 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.