Chiranjeevi: సినీ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం…. ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏపీ ప్రభుత్వానికి వివరించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సినీ పెద్దలు నేడు ముఖ్యమంత్రిని కలిసిన విషయం మనకు తెలిసిందే. కొన్ని నిమిషాల సుదీర్ఘ భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సినీ సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని అందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇదివరకే తాను ముఖ్యమంత్రిని కలిసి సమస్యల గురించి వివరించానని అయితే ఆ సమస్యలపై నేడు జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు.చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామమని చిరంజీవి మీడియా ముందు వెల్లడించారు.అందరికీ ఎంతో లాభదాయకంగా ఉండేలా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అందరికీ సంతోషాన్ని కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందు తెలియజేశారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఉన్న ఈ సమస్యల గురించి ముఖ్యమంత్రి ఈవిధంగా స్పందించడానికి ఎంతో కృషి చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానికి కూడా చిరు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందిన విధంగా ఏపీలో కూడా అభివృద్ధి చెందాలనే వైజాగ్ లో సినిమా షూటింగ్లకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.ముఖ్యమంత్రి అన్న మాటలకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తాము కూడా వీలైనంత సహాయం చేస్తామని తెలిపినట్లు వెల్లడించారు. చిన్న సినిమాలకు 5 షో లకు అనుమతి తెలిపిన ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రత్యేక వెసులుబాటు కోరగా మరోసారి కమిటీతో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించినట్లు తెలిపారు.