Thangedu Puvvu: తంగేడు పువ్వు టీ తో సూపర్ బెనిఫిట్స్

Thangedu Puvvu: అడవులలో లభించే అనేకరకాల ఆకులు, పువ్వులు, పండ్లు, చెట్లు.. ఇలా ప్రతి చెట్టు మానవ శరీరం లో వచ్చే రోగాల్ని నిరోధించగలిగే ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయి. ఇలాంటి కోవకు చెందినదే తంగేడు పూలచెట్టు. పల్లెల్లో దొరికే ఈ తంగేడు పువ్వులతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

తంగేడు పువ్వులను ఎండబెట్టి వాటిని పొడి చేసి.. వేడినీళ్లలో కలుపుకొని తాగాలంట. అంతేకాకుండా ఇది జ్వరం, పిత్త, బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం, రుతుక్రమం సరిగా లేకపోవటం, కడుపులో అల్సర్లు వంటి అనేక రకాల సమస్యలకి సులువుగా చెక్ పెడుతుందట. అలాగే, ఇది శరీరానికి డిటాక్సిఫైయర్ గా కూడా పనిచేస్తుంది అంట. మహిళలకి అనేక ప్రయోజనాలను కలుగచేస్తుంది తంగేడుపువ్వు. ఈ పువ్వు పొడి తో టీ మంచి ఫలితాలను అందచేస్తుంది.