Samantha Item Song : ఇంకొక్క రోజులో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న మరో తెలుగు సినిమా “పుష్ప పార్ట్ 1” దర్శకుడు సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మికా మందన్నా లతో తీసిన ఈ సినిమా పాన్ ఇండియన్ వైడ్ పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళా మండలి, సంఘం వారు మద్దతు తెలుపడం వైరల్ గా మారింది.
దీనికి ఓ ఆసక్తికర కారణం లేకపోలేదు.. గత కొన్ని రోజులు కితమే ఈ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఐటెం సాంగ్ స్టార్ హీరోయిన్ సమంతా పై ప్లాన్ చేసింది రిలీజ్ అయ్యింది. ఇది మగవాళ్ల మనోభావాలను దెబ్బ తీసేలా ఉండడంతో వారు నొచ్చుకోగా మహిళలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారట. ఈ ఘటన అమరావతిలో చోటు చేసుకుంది.
అక్కడి మహిళా మండలి వారు ఈ సాంగ్ చేసిన సమంతాకి అలాగే, పాట రాసిన చంద్రబోస్ కి పాలాభిషేకం చేశారట. అక్కడితో ఆగకుండా సినిమా రిలీజ్ కి చూస్తామని ఈ పాటకి విజిల్స్ కూడా వేస్తామని తెలిపారట. ఇప్పుడు ఈ మెసేజ్ నే సినీ వర్గాలు సహా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.