Anaganaga Oka Raju: ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, చివరిలో భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని ‘అనగనగా ఒక రాజు’ చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. మొదటి షో నుంచే ‘అనగనగా ఒక రాజు’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో.. తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలపడంతో పాటు తమ సంతోషాన్ని పంచుకుంది.

స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల నుంచే అద్భుతమైన స్పందన లభించింది. థియేటర్ లో ప్రతి ఒక్కరూ సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి స్పందన రావడం సంతోషంగా ఉంది. ఇంకా సినిమా చూడనివారు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాము. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా అంతా నవ్వుతూనే ఉన్నారు ప్రేక్షకులు. అదే సమయంలో క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. హాయిగా నవ్వుకుందామని వస్తే, చివరిలో కంటతడి పెట్టించారు అంటూ ఎందరో ప్రశంసిస్తున్నారు. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని ఇచ్చిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతఙ్ఞతలు. మాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు.” అన్నారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “మా సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ఫలితం మా అందరి కష్టాన్ని మర్చిపోయేలా చేసింది. నేను పోషించిన చారులత పాత్ర బాగుందని అందరూ ప్రశంసించడం ఆనందంగా ఉంది. నటిగా ఇది ఛాలెంజింగ్ పాత్ర. మొదటిసారి ఇలాంటి క్యూట్ మాస్ కామెడీ చేశాను. సంక్రాంతి పండుగకు నేను నటించిన సినిమా విడుదలై విజయం సాధించడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “అనగనగా ఒక రాజు సినిమాపై ముందు నుంచి నమ్మకంగా ఉన్నాము. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. అన్ని చోట్లా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రేక్షకులు సినిమాలో కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో.. అంతకన్నా ఎక్కువ చివరిలో ఎమోషన్ కి కనెక్ట్ అవుతున్నారు. రానున్న రోజుల్లో థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వసూళ్లు వస్తాయి.” అన్నారు.

చిత్రం: అనగనగా ఒక రాజు
తారాగణం: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి
సంగీతం: మిక్కీ జె. మేయర్
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

