టీడీపీ సీనియర్ నేతలపై వరుస అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు అవినీతి, అక్రమాల కేసుల్లో విచారణలు ఎదుర్కోంటున్న నేపథ్యంలో తాజాగా మరో సీనియర్ నేత పట్టాభిరామ్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. పోలీసులు ఆయన ఇంటి ముందు భారీగా మొహరించి ఆయన్ని ఇల్లు కదలకుండా చేస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే పోలీసులు చర్యలకు దిగడంతో టీడీపీ నేతల్లో టెన్షన్..రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతకీ పట్టాభిని ఎందుకు అరెస్ట్ చేసినట్లు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
108 అంబులెన్స్ వాహనాల కొనుగోళ్లలో విజయసాయిరెడ్డి 300 కోట్లు కుంభకోణానికి పాల్పడినట్లు పట్టాభీ ఆరోపించారు. ఆ కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియా ముందు ఉంచారు. పాత కాంట్రాక్ట్ ను తప్పించి విజయసాయి రెడ్డి బంధువర్గాలకు 108 అంబులెన్స్ ల కాంట్రాక్ట్ ను కట్టబెట్టారని ఆరోపించారు. దీంతో పట్టాభి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసారు? అన్న కారణంగాగానే పోలీసులు అరెస్ట్ కు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందే హౌస్ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్ పై పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అవినీతికి పాల్పడిన విజయసాయి ఇంటికి పోలీసులు వెళ్తారనుకుంటే నా ఇంటికొచ్చారేంటని? ఆశ్యర్యం వ్యక్తం చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందని ఎద్దేవా చేసారు. అంబేద్కర్ రాజ్యాంగంలో తప్పు చేసిన వాళ్లు శిక్షించబడుతుందని, కానీ రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టే.. తప్పును బయటపెట్టిన వారికి శిక్షపడుతుందని మండిపడ్డారు.