Jr.NTR: బైక్ సీన్ ట్రోల్స్ పై స్పందించిన తారక్.. ఆ సమయంలో అసాధ్యమైనది ఏదీ లేదంటూ..!

Jr.NTR:సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఎన్నో రకాలుగా ట్రోలింగ్ చేస్తుంటారు. ఇలా వారి వ్యక్తిగత విషయాల గురించి లేదా సినిమాలోని కొన్ని సన్నివేశాలు గురించి భారీగా ట్రోలింగ్ చేస్తుంటారు. ఇలా నెటిజన్ల ట్రోలింగ్ కి ఎన్టీఆర్ కూడా గురైన సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ తాజాగా నటించిన RRR సినిమా ట్రైలర్ లో భాగంగా ఎంతో అవలీలగా తారక్ బైక్ ఎత్తే సన్నివేశాన్ని చూపించారు. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజెన్స్ ఈ సన్నివేశంపై ట్రోలింగ్ చేశారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఎన్టీఆర్ కి ఇదే ప్రశ్న రిపోర్టర్ నుంచి ఎదురయింది. ఈ సందర్భంగా ఈ ప్రశ్నకు తారక్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. జక్కన్న ఈ సన్నివేశం నాకు వివరించినప్పుడు నాకు ఇదే సందేహం కలిగింది. వెంటనే తన సందేహాన్ని రాజమౌళి దగ్గర ప్రస్తావించగా ఆయన ఒకటే సమాధానం చెప్పారు.

ఒక మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు, అత్యుత్సాహంతో ఉన్నప్పుడు అసాధ్యం కాని పని అంటూ ఏది ఉండదని సమాధానం చెప్పారు. అసలు ఈ సినిమా చూస్తే ఆ బైక్ సన్నివేశం పై ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుందని ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన గురించి వస్తున్న ట్రోలింగ్ పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల అవుతుందని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. అయితే ఈ సినిమా మరొకసారి విడుదల వాయిదా పడుతుందని పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.