Sukumar- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసం మెగాఫోన్ పట్టనున్న లెక్కల మాస్టర్ సుకుమార్…!

Sukumar- Chiranjeevi: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలకు ఓ లెక్క ఉంటుందని ప్రతి సినిమాతోను రుజువు చేస్తున్నాడు స్టైలిష్ ఫిల్మ్ డైరెక్టర్ సుకుమార్. ఇక రీసెంట్ హిట్ పుష్ప తో సుక్కు రేంజ్ ఇండియా లెవెల్ లో బాగా పెరిగింది. అందరు పుష్ప పార్ట్ 2 గురించి అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక సుక్కుకి బాలీవుడ్ నుండి ఆఫర్స్ బాగా వస్తున్నాయి.bఅయితే సుక్కు మాత్రం పుష్ప పార్ట్ 2 మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇపుడు ఫిల్మ్ నగర్ లో హాట్ హాట్ గా వినిపిస్తోంది.

ఆచార్య సినిమాతో మళ్ళీ యాక్షన్ మోడీలోకి వచ్చిన మెగాస్టార్ తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అయితే మెగా స్టార్ కోసం మెగా ఫోన్ పట్టబోతున్నట్టు సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించాడు సుకుమార్. సుకుమార్ పుష్ప పార్ట్ 2 తర్వాత విజయ్ దేవరకొండతో ఒక చిత్రం తీయబోతున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ తో తన సినిమా ఉండొచ్చని సుకుమార్ తెలియజేశారు.

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు దీని తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో జనగణమన సినిమా తీయనున్నాడు. ఇక చిరంజీవి, సుకుమార్ డైరెక్షన్ లో సినిమా కాదు ఒక రియల్ ఎస్టేట్ కి సంబందించిన యాడ్ ను సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా సుకుమార్ మెగాస్టార్ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మెగా అభిమానులకు పండగే.