సుధీర్ లేకుండా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ టాక్ ఏంటి.. హిట్టా? ఫట్టా?

బుల్లితెర మెగాస్టార్ గా ఇంత మంచి పేరు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా గడుపుతూ అనంతరం వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున సందడి చేసేవారు. అయితే గత కొంత కాలం నుంచి సుడిగాలి సుదీర్ ఈ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించలేదు.దీంతో సుడిగాలి సుదీర్ ఈటీవీ లో ప్రసారమౌతున్న కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారని అందరూ భావించారు.అయితే మల్లెమాల వారితో పారితోషికం విషయంలో గొడవలు రావడం వల్లే ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారని వార్తలు వస్తున్నాయి.

జబర్దస్త్ కార్యక్రమంలో సుధీర్ లేకపోవడంతో ఆటో రాంప్రసాద్ రష్మీ కలిసి స్కిట్ ను ఎలాగో నెట్టుకొస్తున్నారు. ఇకపోతే సుధీర్ గా వ్యవహరించే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా ఆయన లేకపోవడంతో ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన బాధ్యతను కూడా రష్మీకే అప్పగించారు. అయితే ఈ కార్యక్రమం ఒక ఎపిసోడ్ పూర్తి చేసుకుంది.అయితే సుధీర్ లేకుండా ఈ కార్యక్రమం ఎలా కొనసాగింది రష్మీ యాంకర్ గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందా లేదా అనే విషయం గురించి చర్చ మొదలవుతున్నాయి.

సుధీర్ లేకుండా రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఈ కార్యక్రమంలో వందకు రెండు వందల శాతం సుధీర్ లేని లోటు కనబడుతుందని తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తుంటే శుద్ధి స్థానంలో రష్మీ ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో రేటింగ్ రాలేదని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సుధీర్ లేకపోవడంతో ముందుగా వచ్చిన స్థాయిలో రేటింగ్ రాకపోవచ్చని పలువురు భావిస్తున్నారు.