ప్రియుడితో మాల్దీవుల‌కి వెళుతున్న కియారా అద్వానీ..ఈ సారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది!

బాలీవుడ్ భామ‌లు లేదంటే స్టార్ హీరోలు త‌మ ప్రేమాయ‌ణాన్ని ఎంతో గోప్యంగా ఉంచాల‌ని అనుకుంటారు. కొన్ని ఏదో ఒక సంద‌ర్భంలో వారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతుంటారు. విరాట్ కోహ్లీ- అనుష్క, దీపికా ప‌దుకొణే-ర‌ణ్‌వీర్ సింగ్, అలియా- ర‌ణ్‌భీర్ క‌పూర్ ఇలా చాలా మంది జంట‌లు సీక్రెట్ గా ప్రేమాయణం కొన‌సాగించారు. కొన్ని సార్లు కెమెరాల‌కి చిక్క‌డంతో వారి మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌ను త‌ప్ప‌క బ‌య‌ట‌పెట్టారు. తాజాగా బాలీవుడ్‌లో మ‌రో ప్రేమ జంట అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది.

భ‌ర‌త్ అనే నేను చిత్రంలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న న‌టించిన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వాని అంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ఈ భామ ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీ అయింది. అడ‌పాద‌డపా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో కూడా సినిమాలు చేస్తుంది. అయితే కొన్నాళ్లుగా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ భామ చాలా సార్లు కెమెరా కంటికి చిక్కింది. అయిన‌ప్ప‌టికీ త‌మ రిలేష‌న్ షిప్ గురించి ఏనాడు ఓపెన్ కాలేదు. అభిమానులు మాత్రం వీరిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతున్నారంటూ చెప్పుకొస్తున్నారు.

మ‌రో రెండు రోజుల‌లో కొత్త సంవ‌త్స‌రానికి వెల్‌క‌మ్ చెప్ప‌నున్న నేప‌థ్యంలో చాలా మంది సెల‌బ్స్ టూర్స్ వేస్తున్నారు. తాజాగా కియారా అద్వానీ త‌న బాయ్ ఫ్రెండ్ సిద్ధార్ధ్ మ‌ల్హోత్రాతో క‌లిసి న్యూఇయ‌ర్ సెలబ్రేష‌న్స్ కోసం మాల్దీవుల‌కు వెళ్తున్న‌ట్టు తెలుస్తుంది. ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఈ జంట ప్ర‌త్యక్ష‌మయ్యే స‌రికి ఫొటోగ్రాఫ‌ర్స్ వీరిని తమ కెమెరాలో బంధించారు. సిద్దార్థ్ కారు నుంచి దిగిన కియారా అద్వానీ మాస్క్ తో ముఖాన్ని క‌నిపించకుండా క‌వ‌ర్ చేసుకున్న‌ప్ప‌టికి మ‌నోళ్ళు గుర్తు ప‌ట్టేశారు. వ‌చ్చే ఏడాది వీరిరివురు పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం సిద్దార్ద్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ క‌లిసి షేర్షా చిత్రంలో న‌టిస్త‌న్నారు.