Shriya -Saran: గోవా బీచ్ లో కూతురుతో కలిసి రచ్చ చేస్తున్న శ్రియ.. ఫోటోలు వైరల్!

Shriya -Saran: ఇష్టం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన ఎంతో అద్భుతమైన సినిమాలలో నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న శ్రియ ఎప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా, కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా శ్రీయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

ఈ విధంగా 2018 లో శ్రీయ రష్యన్ కి చెందిన ఆండ్రీ కోషీవ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుని వీరి వివాహం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అదేవిధంగా కరోనా సమయంలో ఈమె ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచుతూ తిరిగి తన బిడ్డకు ఏడాది వయసు తర్వాత తన కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరొక్కసారి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇలా తన కూతురు ఫోటోలను షేర్ చేస్తూ తన పేరు రాధ అని చెప్పుకొచ్చారు.

ఇలా నిత్యం తన కూతురుతో కలిసి ఎంతో సరదాగా గడుపుతున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా శ్రీయ తన భర్త కూతురుతో కలిసి గోవా వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే గోవా బీచ్ లో తన కూతురు భర్తతో కలిసి శ్రీయ ఎంజాయ్ చేస్తోంది. సముద్ర తీరాన తన కూతురి చేతిలను పట్టుకొని బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మ మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. ఈ క్రమంలోనే ఈమె గోవా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.