Shannu – Deepthi Sunaina: మళ్లీ కలవబోతున్న షణ్ముఖ్ జస్వంత్.. దీప్తి సునైనా… ఫ్రూఫ్ ఇదే!

Shannu – Deepthi Sunaina:బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటే మరికొంతమంది మాత్రం ఉన్న పేరును కాస్తా పోగొట్టుకున్నారు. ఇలాంటి వారిలో షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన జంట ఒకటి. యూట్యూబ్ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ లు, వీడియో సాంగ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ జంట బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్ళిన షణ్ముఖ్ జస్వంత్ ఈ కార్యక్రమం ద్వారా పూర్తిగా నెగిటివిటీ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునయన తన ప్రేమకు బ్రేకప్ చెప్పారు. అయితే చాలా మంది వీరిద్దరూ తిరిగి కలవాలని కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే అవకాశం ఏర్పడిందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ నిజంగా కలుస్తున్నారా అంటే పొరపాటే.ఎప్పటిలాగే బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సారి బిగ్ బాస్ ఉత్సవం పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇదివరకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లందరూ ఈ వేదికపై సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా షణ్ముఖ్ జస్వంత్.. దీప్తి సునయన కూడా పాల్గొన్నబోతున్నారని ఈ కార్యక్రమం ద్వారా వీరిద్దరూ మరోసారి కలవనున్నారని తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమం ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున ప్రసారం కానుంది.