Samantha: సమంత దక్షిణాది చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. మొన్నటి వరకు హీరో పక్కన గ్లామర్ పాత్రలు చేస్తూ కుర్రకారులో క్రేజ్ సంపాదించిన సామ్ వివాహం తర్వాత తనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ తన స్థాయిని ఇంకొంచం పెంచుకుంటూ వస్తోంది. నాగచైతన్యతో వివాహంతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారో అలాగే విడాకుల తర్వాత కూడా సోషల్ మీడియాలో రోజుకో వార్తతో వైరల్ అవుతున్నారు.
విడాకుల తర్వాత సామ్ ఒకవైపు కెరీర్ లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే ఫ్రెండ్స్ తో పార్టీస్ చేసుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది. ఈ మధ్య ఎక్కువగా మోటివేషనల్ కొటేషన్స్ ను షేర్ చేస్తున్నారు సామ్. తాజాగా ఫాక్ట్ అంటూ సామ్ పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో “డిసిప్లెన్‌గా ఉండాలని ఒకరు చెప్పాల్సిన పనిలేదు, క్రమశిక్షణ మనల్ని బలంగా తయారుచేస్తుంది. క్రమశిక్షణతో ఉంటే తాత్కాలిక ఆనందాలు దక్కకపోయినప్పటికీ.. మున్ముందు అంతకుమించిన ఫలితాలు దరికి చేరతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇదే పునాది కూడా. మీరు కోరుకున్నవన్నీ మీకు ఇచ్చేంతగా మిమ్మల్ని మీరు ప్రేమించడం కూడా తప్పనిసరి” అంటూ సామ్ హిత బోధ చేసింది.
ఇక సమంత ఊ… అంటావా మావ ఊ.. ఊ అంటావా అంటూ స్టెప్పులేసిన పుష్ప ఐటమ్ సాంగ్ ఇండియా మొత్తం ఉపేసింది. ఇక గుణశేఖర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ శాకుంతలం ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక సామ్ చేతిలో మరో పాన్ ఇండియా మూవీ యశోద మరియు హాలీవుడ్ ప్రాజెక్ట్ కుడా ఉన్నాయి. ఇక సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.