Sai Pallavi: అలాంటి పాత్రలో నటించడానికి మెగాస్టార్ కి నో చెప్పిన సాయి పల్లవి మహేష్ బాబుకు ఓకే చెప్పనుందా!

Sai Pallavi: వెండితెరపై ఎంతో అందం అభినయంతో ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఆకట్టుకునే వారిలో హీరోయిన్ సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పని లేదు. ఈమె అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అలాగే ఈమె నటించే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కథలను ఎంపిక చేసుకుంటారు.ఇకపోతే గతంలో ఒకసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సాయి పల్లవికు అద్భుతమైన అవకాశం రావడంతో ఆ పాత్రలో నటించడానికి సాయిపల్లవి నో చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రీమేక్ చిత్రం భోళా శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించడం కోసం చిత్రబృందం సాయిపల్లవి సంప్రదిస్తే అలాంటి పాత్రలో నటించడానికి సాయి పల్లవి ఒప్పుకోలేదు. అయితే ఈ పాత్ర గురించి లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వివరణ తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని అయితే అది మహేష్ బాబుకు చెల్లెలి పాత్రలో నటించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఈ పాత్రలో నటించడం కోసం సాయి పల్లవి అయితే బాగుంటుందని ఆమెను చిత్రబృందం సంప్రదించనున్నారని తెలుస్తోంది. మరి అప్పుడు మెగాస్టార్ చిరంజీవికి నో చెప్పిన సాయి పల్లవి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకు ఎలాంటి సమాధానం చెబుతుందో వేచి చూడాలి. ఈ విషయం గురించి సాయి పల్లవి అభిమానులు స్పందిస్తూ చెల్లెలి పాత్రలలో చేయడానికి ఒప్పుకోకండి ఇలాంటి పాత్రలో నటించడం వల్ల మీ సినీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.