ఆర్ఆర్ఆర్’ నిర్మాత డబ్బులు పోసుకుంటున్నాడు

RRR producer DVV Danayya mints big profits
RRR producer DVV Danayya mints  big profits
 
ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా అంటే మినిమమ్ 200 కోట్లు జేబులో రెడీగా ఉండాల్సిందే. అప్పుడే ఆయనతో సినిమా మొదలుపెట్టగలడు ఏ నిర్మాత అయినా.  సరే.. అంత డబ్బు ఉన్నా సినిమా చేసే వీలుంటుందా అంటే అదీ లేదు.  ఒకింత లక్ కూడ ఉండాలి.  అలాంటి లక్ నిర్మాత డివివి. దానయ్యకు దక్కింది. ‘బాహుబలి’ తరవాత రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసే ఛాన్స్ దొరకింది ఆయనకు.  సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైమాటే. దానయ్య ఒంటరిగానే అంత భారాన్ని మోశారు. సొంత డబ్బు పెట్టారో లేకపోతే అప్పులే తెచ్చారో కానీ 300 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారు.  
 
సినిమాను నిర్మించే ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడిన దానయ్యకు కాసుల వర్షం కురిపిస్తోంది ‘ఆర్ఆర్ఆర్’. సినిమా భీభత్సమైన బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే అన్ని భాషల్లో, ఓవర్సీస్లో కలిపి సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 550 కోట్లకు అమ్ముడుకాగా తాజాగా ఇంకో 350 కోట్ల డీల్ కుదిరింది.  సినిమా యొక్క శాటిలైట్, డిజిటల్ హక్కులను జీ5 సంస్థ 350 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలుచేసింది. అన్ని భాషల నాన్ థియేట్రికల్ హక్కులకు కలిపి ఇంత భారీ మొత్తం రాబట్టిన సినిమా ఇదొక్కటే.  సో.. సినిమా బిజినెస్ మొత్తం కలిపి అటుఇటుగా 900 కోట్ల వరకు ఉంటుంది.  సో.. నిర్మాత డివివి దానయ్య పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభాలు పోసుకున్నారన్నమాట.