
‘మెహబూబా’ సినిమా తర్వాత పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రొమాంటిక్’. కేతికా శర్మ హీరోయిన్. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రబాస్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.
సరే, ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే.. టైటిల్‌కి తగ్గట్లే ‘రొమాంటిక్’ గా ఉంది. హీరోయిన్ తొడల మీదా.. ఆమె అందాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. బీచ్‌లో హీరోయిన్ విరగబడి అందాల ఆరబోత. ఆమె అందానికి పడి చచ్చిపోయే హీరో. సహజంగా పూరీ సినిమాల్లో హీరో, హీరోయిన్లు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు.
పేరుకే అనిల్ పాడూరి డైరెక్టర్. కానీ, పూరీ మార్క్ సినిమాలాగే కనిపిస్తోంది. అన్నట్లు ఈ సినిమాకి పూరీ జగన్నాధ్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే కదా. పూరీ మార్క్ కాకపోతే ఇంకేం కనిపిస్తుందనుకుంటున్నారా.? ఎగ్జాట్లీ.. అదే ఉందీ ట్రైలర్‌లో. ఓవర్ రొ.. మాం.. టి.. క్ లవ్ స్టోరీ. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
