Puri Jagannath: వెరైటీగా పూరి, విజయ్ సినిమా టైటిల్.. వైరల్ అవుతున్న టైటిల్!

Puri Jagannath: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఆ వార్తలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్త సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సినిమా విజయంలో టైటిల్ అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే.

అందుకే సినిమా టైటిల్ విషయంలో ఆచి తూచి వ్యవహరించడంతో పాటు ఆలోచించి క్రేజీగా టైటిల్స్ పెడుతూ ఉంటారు డైరెక్టర్స్. పాన్‌ ఇండియా రేంజ్‌ లో విడుదల చేయడం కోసం అన్ని భాషలకు సూట్‌ అయ్యే విధంగా ఒకే టైటిల్‌ ను ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మధ్య పాన్‌ ఇండియా టైటిల్స్ కామన్ అయ్యాయి. థియేట్రికల్‌ రిలీజ్ కాకున్నా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన సమయంలో అయినా టైటిల్‌ విషయంలో ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో అన్ని భాషలకు కామన్‌ గా ఉండే విధంగా టైటిల్‌ ను ఖరారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ కొత్త సినిమాకు అనుకున్న టైటిల్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ లో పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపించాయి.

కానీ తమిళంలో ఈ టైటిల్ కి ఎక్కువ రీచ్ ఉండదు కాబట్టి బెగ్గర్ అనే టైటిల్ కాకుండా మరేదైనా పెట్టాలని విజయ్ సేతుపతి సూచించాడట. అందుకే బెగ్గర్ కాకుండా అన్ని భాషలకు సెట్‌ అయ్యే విధంగా భవతీ భిక్షాందేహి అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నాడట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే టైటిల్ తో తెలుగు తమిళం భాషల్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్. ఈ టైటిల్ కి తగ్గట్టుగానే సినిమాలో కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇదేం టైటిల్ రా మామ చాలా విచిత్రంగా ఉంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమా టైటిల్ గురించి విన్న అభిమానులు క్రేజీగా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.