Prabhas-Maruthi: మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెబల్ స్టార్.. మూవీ టైటిల్ ఖరారు..!

Prabhas-Maruthi: మారుతి “ఈ రోజుల్లో” సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తన టాలెంట్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలంలోనే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, ప్రేమ కథా చిత్రం వంటి ఎన్నో కామెడీ హర్రర్ మూవీస్ కి దర్శకత్వం వహించి కామెడీ చిత్రాల డైరెక్టర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఈయనకు రెబల్ స్టార్ ప్రభాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మారుతి సినిమా డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. డి.వి.వి దానయ్య నిర్మించబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ను మారుతి డైరెక్ట్ చేయబోతున్నారు.

మారుతి-ప్రభాస్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకు ‘డీలక్స్ రాజా ‘అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో ఈ సినిమా వాయిదా వేయవలసి వచ్చింది. ఇప్పటికే ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మారుతితో చేయబోయే సినిమా కూడా వీటి తరువాత చేయడానికి ఉంది. ఎప్పటినుండో డి వి వి దానయ్య ప్రభాస్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ప్రభాస్ కోసం దానయ్య డైరెక్టర్ కోసం అన్వేషిస్తున్న సమయంలో మారుతి తన కథను ఆయనకు వినిపించాడు. దానయ్య కు కథ నచ్చి ఈ కథను ప్రభాస్ కు రిఫర్ చేశాడు.

మారుతి చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చటంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతోంది. అయితే ఈ సినిమా ఫైనల్ నెరేషన్ కోసం మారుతి మరొకసారి రెబల్ స్టార్ ని కలవనున్నట్టు సమాచారం. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. ప్రభాస్ ఒక్కో సినిమాకు సాధారణంగా చాలా ఎక్కువ సమయం కేటాయిస్తారు. కానీ మారుతి మాత్రం తన సినిమాలను చాలా తొందరగా పూర్తి చేస్తారు. ప్రభాస్-మారుతి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా కామెడీ హర్రర్ నేపథ్యంలో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. అయితే చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో ఏంటో.. ఈ సినిమా వల్ల మారుతి ఇమేజ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.