మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? డెబిట్ కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొత్త రూల్స్ అమలు చేయనుంది. 2020 సెప్టెంబర్ 30 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. గత కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిందని ఆర్‌బీఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. అందుకే కార్డు లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చబోతోంది ఆర్‌బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశాలతో ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇక నుండి మీ క్రెడిట్, డెబిట్ కార్డులపై పలు ట్రాన్సాక్షన్స్ పని చేయవు.
ఏటీఎం కార్డ్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల విషయంలో ఈ రూల్స్ అమలు చేయనుంది. వాస్తవానికి కార్డు లావాదేవీల విషయంలో ఆర్‌బీఐ ఇలాంటి కొత్త నియమనిబంధనల్ని గతంలోనే రూపొందించింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఇవి సరిగ్గా అమలు కాలేదు. ఇప్పుడు వీటిని సెప్టెంబర్ 30 నుంచి కఠినంగా అమలు చేయబోతోంది.
కార్డులు జారీ చేసేప్పుడు ఏటీఎంలు, పీఓఎస్ టెర్మినల్స్‌లో ఉపయోగించేలా డొమెస్టిక్ కార్డుల్ని జారీ చేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్‌బీఐ. అంటే మీకు కొత్త కార్డు వచ్చినప్పుడు అందులో డిఫాల్ట్‌గా ఇంటర్నేషనల్ యూజేస్ ఆప్షన్ ఉండదు. కేవలం డొమెస్టిక్ యూసేజ్‌కి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కావాలనుకుంటే కస్టమర్లు బ్యాంకుని అడిగి యాక్టివేట్ చేయించాలి.
ఇదే కాదు… కాంటాక్ట్‌లెస్, కార్డ్‌లెస్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలోనూ ఇలాంటి మార్పులే ఉండబోతున్నాయి. కస్టమర్లు తమకు అవసరమైన ట్రాన్సాక్షన్స్ మాత్రమే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 తర్వాత వచ్చే కార్డులన్నింటికీ ఇది వర్తిస్తుంది.
ఇప్పటికే మీ దగ్గర క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు ఉంటే సెప్టెంబర్ 30 తర్వాత ఇంటర్నేషనల్, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. వాటి కోసం తప్పనిసరిగా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిఫాల్ట్‌గా ఈ ఆప్షన్స్ ఉండవు. మీ ఖాతా ఉన్న బ్యాంకు వెబ్‌సైట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో మీకు కావాల్సిన లావాదేవీలు ఎంచుకోవచ్చు.
మీరు రిక్వెస్ట్ చేసిన 24 గంటల్లో ఈ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. ఒక్కో బ్యాంకులో ఒక్కోలాగా ఈ ప్రాసెస్ ఉంటుంది. అందుకే బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి మీకు కావాల్సిన లావాదేవీలను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయించాలి. బ్యాంకు మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా లావాదేవీలు యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయొచ్చు.
ఆర్‌బీఐ కొత్త రూల్స్ వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే కస్టమర్లకు ఏ లావాదేవీలు అవసరమో వాటిని మాత్రమే యాక్టీవ్‌లో ఉంచి మీగతావాటిని ఇనాక్టీవ్ చేయడమే. మోసాలను అరికట్టడానికి ఈ కొత్త రూల్స్ ఉపయోగపడతాయి.