Raja Ravindra: మంచు విష్ణుకి నేనే మేనేజర్.. వాళ్ల ప్రొడక్షన్‌లో పని చెయ్యడం ఎలా ఉంటుందంటే..?

Raja Ravindra: ఏదైనా తప్పు జరిగితే తాను చూడలేనని, ఓ ఫ్రెండ్‌కి ఎలా చెప్తామో అలానే చెప్తానని నటుడు రాజా రవీంద్ర అన్నారు. అది చాలా ఓపెన్‌గా మరియు సీరియస్‌గానే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. తాను చెప్పింది అవతలి వాళ్లు అంతే సీరియస్‌గా తీసుకొని మార్చుకుంటే పర్లేదు. కానీ వీడు నాకేంటీ చెప్పేది అనుకుంటే అదే లాస్ డే అవుతుందని ఆయన అన్నారు.
వాళ్లు మాట్లాడకపోయినా, హర్ట్ అయినా పర్లేదు. కానీ తాను ఇలాంటి విషయాల్లో చాలా ఫ్రాంక్‌గా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

హీరో విష్ణు డేట్స్ తానే చేస్తానని ప్రముఖ నటుడు రాజా రవీంద్ర అన్నారు. వాళ్ల సొంత ప్రొడక్షన్‌లో ఏదైనా సినిమా చేస్తున్నపుడు తాను లొకేషన్‌కు వెళ్లడం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. విష్ణు చేసిన సినిమాల్లో అవకాశం వచ్చినపుడు తప్ప ప్రొడక్షన్ సైడ్ చూసుకుంటే వాళ్లకు ప్రత్యేకంగా ఓ సెట్ ఉందని, అదే 24 ఫ్రేమ్స్ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం వాళ్ల పిల్లల పేర్ల మీద కూడా బ్యానర్ ఉందని ఆయన వెల్లడించారు.

ఇకపోతే విష్ణుకు ఎక్కడికెళ్లినా తనకంటూ ఓ ప్రాపర్ సెటప్ ఉంటుందని ఆయన అన్నారు. ఆయన ఫ్యాన్ విజయన్ అనే అతను అన్నీ చూసుకుంటారని రాజా రవీంద్ర తెలిపారు. వెబ్ సిరీస్‌కి సంబంధించి సురేష్ అనే అతను, నాలుగైదు ప్రొడక్షన్స్‌లో చేసినా కూడా ఆయకంటూ ఓ ప్రత్యేకమైన సెటప్ ఉందని ఆయన అన్నారు.