Puri Jagannath: అతడు లేకుండా సినిమా చేయనంటున్న పూరి.. ఎవరు అతను?

Puri Jagannath: ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘ లైగర్ ‘ సినిమా తెరకెక్కుతోంది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి , పోకిరి ,ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఒక ఒక వైవిధ్యమైన కథతో లైగర్ సినిమా తీస్తున్నారు.
అయితే అందరికీ ఏదో ఒక విషయంలో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే మన పూరి జగన్నాథ్ కి కూడా ఒక సెంటిమెంట్ ఉందట.

సాధారణంగా అందరికీ సెంటిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. సినిమా హీరో హీరోయిన్ ల కాంబినేషన్, సినిమా రిలీజ్ డేట్స్ , మూవీ టైటిల్స్ వంటి ఎన్నో విషయాలలో ఎంతో మందికి సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే మన పూరి జగన్నాథ్ కి కూడా తను తీసే చిత్రంలో నటుడు సుబ్బరాజు ఉంటే ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఉందట . పూరి జగన్నాథ్ తీసిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి , నేను నా రాక్షసి , టెంపర్ ,బిజినెస్ మాన్ , వంటి ఎన్నో చిత్రాలలో సుబ్బరాజు నటించారు. ఆయన నటనతో ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు . ఒకరకంగా పూరి జగన్నాథ్ వల్లే సుబ్బరాజుకు ఇంత మంచి అవకాశాలు వచ్చాయి అనటంలో కూడా సందేహం లేదు .
సుబ్బరాజు మొదటిసారిగా పూరి జగన్నాథ్ నిర్మించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో నటించారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పటినుండి సుబ్బరాజు తన సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని పూరికు ఒక సెంటిమెంట్ ఉంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమా డైరెక్షన్ పనులతో బిజీగా ఉన్నారు . విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది . ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.