Home News దీపికాపై ప్రేమ‌ను కురిపించిన ప్ర‌భాస్.. వైర‌ల్‌గా మారిన పోస్ట్‌

దీపికాపై ప్రేమ‌ను కురిపించిన ప్ర‌భాస్.. వైర‌ల్‌గా మారిన పోస్ట్‌

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టుడు ప్ర‌భాస్. ఇప్పుడు ఈ హీరో సినిమాల‌కి ఫుల్ క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్ అనే చిత్ర షూటింగ్ పూర్తి చేయ‌గా, త్వ‌ర‌లో ఆదిపురుష్‌, స‌లార్, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొన‌నున్నాడు. ముందుగా ఆదిపురుష్ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ సినిమాని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు.

Prabhas | Telugu Rajyam

నాగ్ అశ్విన్ – ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం పీరియాడిక‌ల్ మూవీ కాగా, ఇందులో దీపికా ప‌దుకొణే క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని కొద్ది రోజుల క్రితం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.అయితే ఈ రోజు దీపికా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప్రభాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దీపికాకు సంబంధించిన అంద‌మైన ఫొటో షేర్ చేస్తూ.. హ్యాపీ బ‌ర్త్ డే టూ గార్జియ‌స్ సూప‌ర్ స్టార్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. త‌న హీరోయిన్‌కు ప్ర‌భాస్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం ప‌ట్ల నెటిజ‌న్స్ హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెండి తెర ఆరాధ్య దైవంగా ప్రశంసలు అందుకున్న దీపికా పదుకొనే ఈ రోజు 35 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా ఆమెకు సినీ ప్ర‌ముఖులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. 14 ఏళ్ళుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న దీపిక ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, యే జవానీ హై దివానీతోపాటు పీరియాడిక్ చిత్రాలు అయిన‌ బాజీరావ్ మస్తాని, పద్మావత్.. వంటి చిత్రాల‌లో న‌టించి ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. త‌న భర్త రణవీర్ తో కలిసి కపిల్ దేవ్ బయోపిక్ లో న‌టించ‌గా, ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News