Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జూన్ నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు భాగమైన విషయం తెలిసిందే. ఇక తెలుగులో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ కూడా ఈ సినిమాలో రుద్ర పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ మంటి వారందరూ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ లెజెండరీ యాక్టర్ కాదని ఆయన సాదాసీదా నటుడు అంటూ విష్ణు మాట్లాడారు.ప్రభాస్ నా దృష్టిలో నార్మల్ యాక్టర్ మాత్రమే. లెజెండ్ యాక్టర్ కాదు. ఆయన లెజెండ్ యాక్టర్ అవ్వడానికి ఇంకా టైం పడుతది.. కానీ మోహన్ లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్. ఎందుకంటే కాలం మోహన్‌లాల్‌ను లెజండరీ యాక్టర్‌ను చేసింది.. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు తప్పకుండా ఏదోఒక రోజు లెజెండ్‌ను చేస్తాయని విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.