వ్యాక్సినేషన్ : వ్యాక్సిన్ అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారట !

AIIMS director says vaccine will come in next january

దేశంలో వ్యాక్సినేషన్ మొదలై 18 రోజులైంది. రోజువారీ టీకా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. గడచిన వారం రోజుల వ్యవధిలో రోజువారీ టీకాల సంఖ్య 5.7 లక్షల నుంచి 1.8 లక్షలకు పడిపోయింది. సరాసరి లబ్దిదారుల శాతం కూడా 57 నుంచి 49 శాతానికి తగ్గింది. జనవరి 28న ఒక్కో టీకా కేంద్రంలో లబ్దిదారుల సంఖ్య సగటున 56గా నమోదు కాగా, జనవరి 31న ఇది 57కు చేరింది.

china released corona vaccine last month

ఫిబ్రవరి 2న వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సగటు లబ్దిదారుల సంఖ్య 49కి పడిపోయింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం స్పందిస్తూ, శరవేగంగా టీకాను పంచుతున్న దేశంగా ఇండియా నిలిచిందని, మరే దేశంలోనూ లేనివిధంగా 18 రోజుల వ్యవధిలోనే 40 లక్షల మందికి టీకాలు వేశామని పేర్కొంది. ఇదే సమయంలో టీకా లక్ష్యానికి మాత్రం ఇండియా చాలా దూరంగా ఉందని ప్రజారోగ్య నిపుణులు వ్యాఖ్యానించారు.

మనం లక్ష్యంగా పెట్టుకున్న 60 కోట్ల డోస్ లను 30 కోట్ల మందికి వచ్చే ఆరు నెలల్లో పంచాలంటే, రోజుకు 33 లక్షల మందికి టీకాలను ఇవ్వాల్సి వుంటుంది. మరిన్ని వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా తెరవాల్సిన అవసరం ఉంది. మరింత మంది వాలంటీర్లను నియమించుకోవాలి. ప్రభుత్వం తరఫున వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరలేమని భావిస్తే, ప్రైవేటు సెక్టారును అనుమతించాలి” అని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావలంకార్ అభిప్రాయపడ్డారు.