వకీల్ సాబ్’ నాటికి థియేటర్లు మూతబడకేపోతే చాలు

Pawan fans tensed about theatres

Pawan fans tensed about theatres

లాక్ డౌన్ తర్వాత అత్యంత సగంగా కోలుకున్న సినీ పరిశ్రమల్లో తెలుగు పరిశ్రమ మొదటిది. మనం పిక్ అప్ అయినంత వేగంగా ఏ ఇండస్త్రీ పుంజుకోలేదు. హిందీ ఇండస్ట్రీ ఇప్పటికీ బలహీనంగా ఉంది. తమిళ పరిశ్రమ అంతంత మాత్రంగానే నడుస్తోంది. ఒక్క మన దగ్గర మాత్రమే జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 50 సినిమాల వరకు విడుదలయ్యాయి. వాటిలో చిన్న మీడియమ్ సినిమాలే అన్నీ. ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. పెద్ద హీరోల్లో మొదటి బోణీగా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో దిగుతున్నారు.

ఈ నెల 9న సినిమా రిలీజ్ కానుంది. దీని వెనుక అందరు స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. అభిమానులంతా పవన్ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే కోవిడ్ మళ్ళీ విజృంబిస్తోంది. కేసులు రికార్డ్ స్థాయిలో పెరిగిపోయాయి. ఒకే రోజు లక్షకు పైగా కేసులు వచ్చాయి. మరణాలు పెరిగాయి. దీంతో హిందీ పరిశ్రమ ఏప్రిల్ 30 వరకు మూతబడింది. బాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. కొత్త తేదీలు చూసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడ కేసులు పెరుగుతున్నాయి. చాలామంది మన దగ్గర కూడ థియేటర్లు మూతబడతాయి అంటున్నారు. అందుకే షూటింగ్స్ షెడ్యూల్స్ మారుతున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గవచ్చని, అసలు హాళ్లు మూతబడినా పడవచ్చని అంటున్నారు. దీంతో పవన్ అభిమానుల్లో కొంత కంగారు నెలకొంది.