Jr.NTR: రాజావారు బాధ్యతలు మొత్తం తనపై వేసుకున్న ఎన్టీఆర్… కారణం అదేనా?

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే వరుస సినిమా షూటింగులు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ సినిమా బాధ్యతలను తీసుకున్నారు.ఈ విధంగా తన వరస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ మరొక సినిమా బాధ్యతలు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి వారసుల పరంపర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది వారసులు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ చంద్ర హీరోగా శ్రీ శ్రీ రాజా వారు అనే సినిమా టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ‘తీవండి’ అనే సినిమా ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమానే శతమానం భవతి డైరెక్టర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించగా ఈ సినిమాని స్వయంగా నితిన్ చంద్ర తండ్రి నార్నే శ్రీనివాస్ నిర్మించారు.ప్రస్తుతం షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించిన అన్నీ బాధ్యతలను ఎన్టీఆర్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇలా దగ్గరుండి తన బావమరిది సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను సినిమా బాధ్యతలను ఎన్టీఆర్ చూసుకో నున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ద్వారా నితిన్ చంద్ర ఏవిధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ సినిమా పై డైరెక్టర్ సతీష్ వేగేశ్నఎన్నో అంచనాలు పెట్టుకున్నారు మరి ఈ సినిమా ఆ అంచనాలను చేరుకుంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.