యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కెరియర్ మొదట్లో ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది.ఈమె ఒక స్టార్ హీరో వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనకు ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఈమె ఎంతో ధైర్యంగా తన టాలెంట్ తో మరికొన్ని అవకాశాలను అందుకొని తానేంటో నిరూపించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఒకప్పుడు ఐరన్ లెగ్ అన్న వారే ప్రస్తుతం శృతిహాసన్ గోల్డెన్ లెగ్ అంటూ తనకు వరుస సినిమా అవకాశాలను ఇస్తున్నారు.ప్రస్తుతం ఈమె తెలుగులో ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ నెపోటిజం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి తన తల్లిదండ్రుల పేరు ఉపయోగించుకొని ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటారనీ చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదని శృతిహాసన్ వెల్లడించారు.
స్టార్ సెలబ్రిటీలు తమ పిల్లల సినిమా ఎంట్రీ కోసం మాత్రమే వారి పేర్లను ఉపయోగించుకోవచ్చు కానీ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవాలని ఇక్కడ నిలదొక్కుకోవాలన్న వారికంటూ సొంత టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరని ఈమె తెలిపారు. ఇకపోతే తాను కూడా సెలబ్రిటీ కిడ్ అయినప్పటికీ తన తల్లిదండ్రులు తనకు అవకాశాలు ఇవ్వమని ఎవరికీ రికమండేషన్ చేయలేదని కేవలం తన సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకున్నానని ఈ సందర్భంగా శృతిహాసన్ తెలిపారు. ఈ విధంగా నెపోటిజం గురించి శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
