Bhalakrishana – Nivetha Thomas: జై బాలయ్య అంటూ రెచ్చిపోయిన నివేథా.. పగలబడి నవ్విన ప్రీతమ్!

Bhalakrishana – Nivetha Thomas: బోయపాటి శ్రీను,బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో జై బాలయ్య అనే పాట విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ పాటకు డాన్స్ వేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పాటకు నటి నివేథా థామస్ కూడా డాన్స్ చేస్తూ అచ్చం బాలయ్య స్టెప్పులను దించేశారు.

నివేథా థామస్ ఈ డాన్స్ వేయగా తన సోదరుడు సహాయం తీసుకున్నారు.అయితే ఈ పాటలో ఈమె వేసిన స్టెప్పులకు మొదటి చొక్కా వర్కవుట్ అయినట్టు రెండవ చొక్కా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.కొందరు సూపర్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఈ పాటకు మీరే కొరియోగ్రఫీ చేశారు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నివేద థామస్ చేసిన ఈ వీడియో పై సమంత డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ స్మైలీ ఎమోజీలను షేర్ చేశారు. అదేవిధంగా నటి అనుపమ పరమేశ్వరన్ కూడా స్పందిస్తూ.. అద్భుతంగా ఉందని కామెంట్ చేయగా రాశిఖన్నా ఈ వీడియో డాన్స్ పై నవ్వుతున్న ఎమోజీ లను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.