Nisha Aggarwal: నా రెండవ బిడ్డ ఆన్ ది వే:నిషా అగర్వాల్

Nisha Aggarwal: టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈమె గత ఏడాది అక్టోబర్ 30న వ్యాపారవేత్త గౌతమ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరం అయింది. ఇకపోతే ఇది ఇలా ఉంటే ఇటీవలే కాజల్ తన సీమంతానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకునే విషయం తెలిసిందే. కాజల్ తో పాటు తన కుటుంబ సభ్యులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 

ఇదే విషయాన్ని ఈ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడాతాజాగా ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది.నాకు మరొక బిడ్డ పుట్ట బోతోంది. నా రెండవ బిడ్డ ఆన్ ది వే.. నిన్ను కలుసుకోవడానికి ఇంకా వెయిట్ చేయలేను లిటిల్ వన్ అంటూ కాజల్ అగర్వాల్ తో కలిసి దిగిన ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది నిషా అగర్వాల్. ఈ సందర్భంగా త్వరలోనే పేరెంట్స్ కాబోతున్న గౌతమ్, కాజల్ కి తన బెస్ట్ విషెస్ తెలియజేసింది నిషా అగర్వాల్. ఇక నిషా అగర్వాల్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.