తెలుగు బుల్లితెరపై యాంకర్ ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ రవితో కలిసి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేసిన లాస్య గత కొంతకాలం నుంచి బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది.తాను ప్రేమించిన వ్యక్తి మంజునాథ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె పూర్తిగా బుల్లి తెరకు దూరమైంది. అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ త్వరగా తిరిగి ఈమె బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా బుల్లితెరపై వివిధ కార్యక్రమాలు స్పెషల్ ఈవెంట్ ద్వారా లాస్య ఎప్పటిలాగే ప్రేక్షకులను సందడి చేస్తోంది.
ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే లాస్య తనకంటూ ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే తనకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకుంటారు. ఇక లాస్య మంజునాథ్ దంపతులకు జున్ను అనే కుమారుడు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం బాబుకి మూడు సంవత్సరాలు. తాజాగా లాస్య తన పుట్టిన రోజు వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇంట్లో ఒక బాబు ఉన్న తర్వాత చాలామంది రెండో సారి ప్రెగ్నెన్సీ గురించి అడగడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే లాస్య కుటుంబ సభ్యులతో పాటు నెటిజన్లు తన స్నేహితులు కూడా తన రెండవ ప్రెగ్నెన్సీ గురించి తరచూ ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తనని ఈ విధంగా రెండవ ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నలు అడిగే వారికి లాస్య తనదైన శైలిలో సమాధానం చెప్పింది.ఇలా రెండో ప్రెగ్నెన్సీ గురించి తనను ఎవరైనా అడిగితే చెంప పగల కొట్టాలి అనే భావన కలుగుతుంది అని వీడియో ద్వారా చూపించారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ కావడంతో కొందరు లాస్య వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. రెండవ ప్రెగ్నెన్సీ గురించి అడగడంలో తప్పేముంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.