Home News చంద్రబాబు పుట్టినరోజుపై సోషల్ నెగెటివిటీ పంజా

చంద్రబాబు పుట్టినరోజుపై సోషల్ నెగెటివిటీ పంజా

Chandrababu Birtday

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు నేడు. టీడీపీ శ్రేణులు, సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఆయన హయాంలో తెరపైకొచ్చిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ‘విజనరీ లీడర్’ అని కొనియాడుతున్నారు. అయితే, ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే.

సోషల్ మీడియాలో నెగెటివిటీ గురించి కొత్తగా చెప్పేదేముంది.? సినీ సెలబ్రిటీల విషయంలో, రాజకీయ నాయకుల విషయంలో ఈ నెగెటివిటీ అత్యంత జుగుప్సాకరంగా మారుతోంది. #HbdTelugu420CBN పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోందంటే దానికి కారణం వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లే. కొందరు వైసీపీ నేతలూ చంద్రబాబుని 420 అని పేర్కొంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు వెటకారంగా చెబుతున్నారు. ఈ లిస్టులో వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా వున్నారు. ఇది రాజకీయాల్లో అస్సలేమాత్రం స్వాగతించకూడని విషయం. నిజానికి, రాజకీయ నాయకులంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయమిది. రాజకీయాల్లోనే కాదు, సినీ రంగానికి కూడా ఈ తరహా నెగెటివ్ ట్రెండింగ్ అస్సలు మంచిది కాదు.

తమిళ సినీ పరిశ్రమ విషయానికొస్తే, అజిత్ – విజయ్ అనే ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య ఇలాంటి చెత్త ట్రెండింగ్ నడుస్తుంటుంది. ఆ ఇద్దరు హీరోలూ స్నేహపూర్వకంగానే వుంటారు. అభిమానులకే పైత్యం.ఇక్కడ చంద్రబాబు – వైఎస్ జగన్ మధ్య వ్యక్తిగత వైరాలు వుంటాయని అనుకోలేం. అయితే, జగన్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ మద్దతుదారులు నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ చేయడం చూశాం. కుక్క కాటుకి చెప్పుదెబ్బ.. అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ఈ జుగుప్సాకరమైన సోషల్ పోటీకి చరమగీతం పాడాల్సిందే.

Related Posts

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

జనసేన కొంప ముంచనున్న విశాఖ స్టీల్ ప్లాంట్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖ స్టీలు ప్లాంటుని సందర్శించబోతున్నారట అతి త్వరలో. ఈ విషయాన్ని ఇటీవలే జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆయన విశాఖ వెళ్ళారు, స్టీలు...

Related Posts

Latest News