Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తదుపరి సినిమాల గురించి కూడా వెల్లడించారు నాని కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక నాని నిర్మాణంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించడం విశేషం. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాణంలో చిరు నటించబోతున్నారు త్వరలోనే ఈ సినిమా పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అయితే ఈ సినిమా గురించి నాని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉందని తెలిపారు ఆయన నా సినిమా విడుదలైన ప్రతిసారి డియర్ నాని అంటూ నా సినిమా గురించి పోస్టులు చేస్తూ ఉంటారు అదేవిధంగా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాకు విషెస్ చెబుతూ ఉంటారు.
ఒకసారి చిరంజీవి గారు నాకు సైకిల్ గిఫ్టుగా పంపించారు కానీ నేను దానిలో ఒక అవార్డుగా భావించిన ఆఫీసులో పెట్టుకున్నానని నాని తెలిపారు. ఇకపోతే శ్రీకాంత్ తో కలిసి సినిమా పని కోసం వెళ్తే చిరంజీవి గారు మాకు ఏకంగా బజ్జీలు చేయించి పెట్టారు చాలా బాగుంటాయి బజ్జీలు తినండి అని చెప్పారు. అయితే చిరంజీవి ముందు తినడానికి తాను ఇబ్బంది పడ్డానని నాని తెలిపారు.
మా సినిమా పోస్టర్ రిలీజ్ కోసం చిరంజీవి గారిని కలిసాను అందుకోసం ఫేక్ బ్లడ్ కూడా తెప్పించి ఆ బ్లడ్ లో చేయి పెట్టి పైకి లేపాల్సి ఉంటుంది అందుకోసం ఫేక్ బ్లడ్ కూడా తెచ్చామని చెప్పడంతో అసలు ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి అంటూ చిరంజీవి గారు ప్రశంసలకు కురిపించారు. ఇక ఈ పోస్టర్ రిలీజ్ సమయంలో శ్రీకాంత్ నేను వైట్ షర్ట్స్ వేసుకొని ఉన్నాము కానీ చిరంజీవి గారు బ్లాక్ షర్ట్ వేసుకున్నారు.
ఆ సమయంలో సర్ ఏమనుకోకుండా కాస్త వైట్ షర్ట్ వేసుకుంటారా అంటూ నేను తనని అడగడంతో వెంటనే ఓకే ప్రొడ్యూసర్ గారు అంటూ చిరంజీవి గారు మాట్లాడారు ఆ మాటతో నేను ప్రొడ్యూసర్ గా ఫీల్ అయ్యాను అంటూ నాని తెలిపారు అయితే తన పారడైజ్ సినిమా పూర్తి అయిన తర్వాతనే చిరంజీవి శ్రీకాంత్ సినిమా శ్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయని నాని ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.